హైదరాబాద్, సెప్టెంబర్ 5, 

రోడ్డుపై ట్రాఫిక్‌ నిబంధనల అమలులో వాహనదారులు, పోలీసుల భద్రతకు సమాన ప్రాధాన్యం ఉండాలి. చలాన్‌ భయంతో వాహనదారులు ప్రాణాలను పణంగా పెట్టేలా వ్యవహరించకూడదు. అదే సమయంలో పోలీసులూ వాహనాలను ఆపే క్రమంలో ప్రమాదాలకు దారితీసే విధానాలకు దూరంగా ఉండాలి.

పోలీసుల తనిఖీల్లో వాహనాన్ని ఆపమని సూచించినప్పుడు వాహనదారులు తప్పనిసరిగా ఆగాలి. చలాన్‌ పడుతుందనే భయంతో వేగంగా దూసుకెళ్లడం, పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రమాదకరంగా డ్రైవింగ్‌ చేయడం వల్ల వాహనదారులతో పాటు రోడ్డుపై ప్రయాణిస్తున్న ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడుతుంది.

వాహనం ఆపకుండా వెళ్లిపోయిన సందర్భాల్లో పోలీసులు కూడా వెళ్తున్న వాహనాన్ని ఒక్కసారిగా అడ్డుకోవడం, ప్రమాదకరంగా వెంబడించడం చేయకుండా వాహనం నంబర్‌ను నమోదు చేసి నిబంధనల ప్రకారం ఈ-చలాన్‌ జారీ చేసే విధానాన్ని అనుసరించడం సురక్షితం.

చలాన్‌ కట్టడం ద్వారా సమస్య పరిష్కారమవుతుంది.. కానీ ప్రమాదంలో పోయిన ప్రాణం తిరిగి రాదు. కాబట్టి వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలి. పోలీసులు కూడా ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని సురక్షిత పద్ధతుల్లో తనిఖీలు నిర్వహించాలి.

🚦చలాన్‌ కంటే ప్రాణం ముఖ్యం.. 

నిబంధనలు పాటిద్దాం.. పరస్పరం సహకరించుకుందాం.. సురక్షితంగా ఇంటికి చేరుదాం.