బాహుబలి తరహాలో వాగు దాటుతున్న వ్యక్తి.. చిన్నారిని భుజాలపై ఎక్కించుకుని సాహసం
ఆసిఫాబాద్ జిల్లా, కెరమెరి:
అనార్పల్లి వాగును దాటేందుకు గ్రామస్థులు నిత్యం ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కరంజివాడకు వెళ్లే మార్గంలో వాగులో నీటి ప్రవాహం కొనసాగుతున్నప్పటికీ, రాకపోకలకు సరైన సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఓ వ్యక్తి చిన్నారిని భుజాలపై ఎక్కించుకుని నీటి ప్రవాహం మధ్యలో వాగును దాటుతున్న దృశ్యం ‘బాహుబలి’ సినిమా తరహాలో కనిపించింది. ఈ దృశ్యం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. చిన్నారులతో సహా గ్రామస్థులు ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో వాగు దాటాల్సి రావడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వాగుపై సరైన వంతెన లేదా శాశ్వత రాకపోకల సౌకర్యం కల్పించకపోవడంతో వర్షాకాలంలో సమస్య మరింత తీవ్రంగా మారుతోందని గ్రామస్థులు చెబుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి వాగుపై శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు కోరుతున్నారు.
