హనుమకొండ కేదారి దంపతుల మృతి కేసులో ట్విస్ట్
అగ్ని ప్రమాదం కాదు, షట్టర్ ఓనర్ చేసిన అవమానం భరించలేకే దంపతుల ఆత్మహత్య
గత 40 సంవత్సరాలుగా వారి మెస్ లో ఎంతో మందికి తక్కువ ధరలో భోజనం అందించిన దంపతులు
అద్దె చెల్లించడం లేదని హోటల్ కి తాళం వేసి కేదారి భార్య పుష్పలతను తీవ్ర పదజాలంతో దూషించిన ఓనర్ కుమారుడు రాము
ఆర్థిక ఇబ్బందుల కారణంగా అద్దె చెల్లించలేదని దంపతులు ఎంత బతిమిలాడినా రాము వినకపోవడంతో మనస్తాపం చెంది ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న దంపతులు
భర్త కేదారి అక్కడికక్కడే మృతి చెందగా భార్య పుష్పలత ఎంజీఏం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
కేదారి కుమారుడు పృథ్వీ ఫిర్యాదు మేరకు షట్టర్ ఓనర్ మరియు కుమారుడిపై కేసు నమోదు చేసిన సుబేదారి పోలీసులు
