ఈ నెల 14న పల్నాడు జిల్లాలోనిర్వహించవలసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్),రెవిన్యూ క్లినిక్ కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల ఒక ప్రకటనలో తెలిపారు.

సోమవారం వినాయక చవితి పర్వదినం సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.ఈ మార్పును అర్జీదారులు అందరూ గమనించాలని కోరారు.

అర్జీదారులు దాఖలు చేసిన దరఖాస్తులు ఇంకా పరిష్కారం కాకపోయినా లేదా తమ ఫిర్యాదుల సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేసి సంప్రదించవచ్చని తెలిపారు.ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలకు పరిష్కారం పొందవచ్చని సూచించారు.అదేవిధంగా అర్జీదారులు తమ సమస్యలను ఆన్‌లైన్‌లో Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ వెల్లడించారు.