వరుసగా 4 రోజుల పాటు బ్యాంకులు బంద్.. దేశవ్యాప్తంగా క్లోజ్.. ముందే జాగ్రత్త పడండి..
సెప్టెంబర్ 11న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మెకు బ్యాంక్ యూనియన్లు పిలుపునిచ్చాయి. వారానికి ఐదు రోజుల పని విధానం, పింఛను సమస్యల పరిష్కారం వంటి డిమాండ్లతో ఈ సమ్మె చేపడుతున్నారు. దీని ప్రభావంతో బ్యాంకులు వరుసగా నాలుగు రోజుల పాటు మూతపడనున్నాయని చెప్పవచ్చు.
సెప్టెంబర్ 11న సమ్మె ప్రభావంతో బ్యాంకు సేవలు ప్రభావితం కానుండగా.. ఆ తర్వాత సెప్టెంబర్ 12న రెండో శనివారం బ్యాంకులకు సాధారణ సెలవు కావడంతో ఆ రోజు మూతపడనున్నాయి. ఇక సెప్టెంబర్ 13న ఆదివారం బ్యాంకులు ఉండవు. ఆ తర్వాతి రోజు సెప్టెంబర్ 14న వినాయక చవితి పండుగ సెలవుల కారణంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు దేశవ్యాప్తంగా నిలిచిపోనున్నాయి. దీంతో సెప్టెంబర్ 11 నుంచి 14 వరకు వరుసగా నాలుగు రోజుల పాటు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయని చెప్పవచ్చు. దీంతో వల్ల బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్, చెక్కుల క్లియరెన్స్‌తో పాటు ఇతర సేవలు నిలిచిపోనున్నాయి. సాధారణ ప్రజలతో పాటు వ్యాపార, వాణిజ్య వర్గాలపై ఇది ప్రభావం చూపనుంది. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే సెప్టెంబర్ 28 నుంచి మరో మూడు రోజుల పాటు, ఆపై అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని బ్యాంక్ ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి.
