డెలివరీ బాయ్స్ కోసం హైదరాబాద్‌లో ప్రగతి కేంద్రాల ఏర్పాటు

తెలంగాణ : డెలివరీ బాయ్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ప్రాజెక్ట్ ప్రగతి పేరుతో జెప్టోతో కీలక ఒప్పందం చోటుచేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా గిగ్ వర్కర్ల కోసం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ప్రగతి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం, జెప్టో సంస్థ కలిసి ఈ సెంటర్లను త్వరలో ఏర్పాటు చేయనున్నాయి. తొలుత నగరంలో 5 కేంద్రాలను నెలకొల్పనున్నారు. ఈ సెంటర్లలో వాటర్, వాష్ రూమ్స్, మొబైల్ ఛార్జింగ్, వైఫై, ఫస్ట్ ఎయిడ్ వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.