శ్రీశైలం ప్రాజెక్టు వద్ద గేటు తెగిపడటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. నీటిని విడుదల చేసేందుకు గేట్లను ఎత్తుతున్న సమయంలో రోప్‌ తెగిపోవడంతో 9వ నంబర్‌ గేటు అదుపుతప్పి కిందపడినట్లు తెలుస్తోంది.

ఆ సమయంలో శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ పూర్తిస్థాయిలో ప్రవహిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గేటు తెగిపడిన ఘటనపై అధికారులు పరిశీలన చేపట్టారు. గేట్ల నిర్వహణ, రోప్‌ సామర్థ్యం, పాత పరికరాల పరిస్థితిపై కూడా చర్చ జరుగుతోంది.

ఇదే తరహాలో 2022లో 10వ నంబర్‌ గేటు కూడా తెగిపడటం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. వరుసగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో ప్రాజెక్టు గేట్ల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.