బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం

▪️48 గంటల పాటు మత్స్యకారులు వేటకు వెళ్ళారాదు 

▪️ఉత్తరాంధ్ర జిల్లాలకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షసూచన 

ఉపరితల ఆవర్తన ప్రభావంతో, గురువారం ఉదయం 05:30 గంటల నాటికి ఉత్తర బంగాళాఖాతం,పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉండి అలలు ఎగసి పడే అవకాశం ఉందని మత్స్యకారులు రాబోయే 48 గంటల పాటు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.