నిర్మల్‌లో బీఆర్ఎస్‌ను మరింత బలోపేతం చేయాలని కేటీఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రామచరణ్ నాయకత్వంలో పార్టీ కార్యక్రమాలను విస్తరించాలని, యువ నాయకులు అనిల్ జాదవ్, జాన్సన్ రాథోడ్ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. నవంబర్ 11న నిర్మల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సభలో మరిన్ని చేరికలు ఉంటాయని వెల్లడించారు. పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులు, కార్యకర్తలకు తగిన బాధ్యతలు అప్పగించే అంశంపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, కందాల ఉపేందర్ రెడ్డి, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు జాన్సన్ నాయక్ మరియు ఇతర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.