ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులతో సమావేశం అయిన టీపీసీసీ అధ్యక్షులు, ప్రభుత్వ సలహాదారు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులతో సమావేశం అయిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి తదితరులు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో త్వరలో నియమించబోయే సహకార సంఘాల ఛైర్మన్ ల నియామకాలు ఇతర రాజకీయ అంశాలపై చర్చించిన నాయకులు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (PCC )అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారిని కలిసిన వారిలోమాజీ మంత్రి వర్యులు అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి గారు, నిర్మల్ జిల్లామాజీ జడ్పిటిసి ల ఫోరమ్ అధ్యక్షులు పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి గారు, ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ (DCC )అధ్యక్షులు నరేష్ జాదవ్ గారు, అదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచ్ శ్రీకాంత్ రెడ్డి గారు, బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆడే గజేందర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ పార్లమెంట్ (MP )సభ్యుడు సోయం బాపు రావు గారు తదితరులు ఉన్నారు.
