తెలంగాణ ప్రజల ప్రతీక బతుకమ్మ పండుగ.
తెలంగాణ ప్రజల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ అని పూలని పూజించే సంస్కృతి తెలంగాణ ప్రజలదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ దొంగరి రేవతి శంకర్ అన్నారు. తొర్రూరు పట్టణ కేంద్రంలో సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళలందరూ అంగరంగ వైభవంగా తీరక్క పూలతో బతుకమ్మలు పేర్చి ముకుమ్మడిగా పట్టణ కేంద్రంలోని పెద్ద చెరువుకు బయలుదేరారు. ఈ సందర్భంగా రేవతి శంకర్ మాట్లాడుతూ ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజలకు అవసరమైన పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వమని అన్నారు. ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఈ ప్రభుత్వం ఇవ్వలేనని రేషన్ కార్డులు రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేసి పేదల ఆకలి తీరుస్తున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వమని అన్నారు.
