గత కొద్దిరోజులుగా రాజకీయంగా వేడి వేడిగా సాగుతున్న ఐజ మున్సిపాల్టీ లోని యింటి అనుమతులతో నడుపుతున్న కమర్షియల్ షెల్టర్ల సీజుల వ్యవహారం విషయంలో ఎంపీ మల్లు రవి గారు బి ఆర్ ఎస్ నాయకులకు మద్దతుగా లెటర్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన 7 గురు కౌన్సిలర ఈరోజు నగర్ కర్నూలు లో అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తో కలిసి ఎంపీ మల్లు రవిని కలిసి లెటర్ ను వెనక్కి తీసుకోవాలని అనధికారిక వ్యాపార సముదాయాలను చట్టాన్ని అనుసరించి సీజ్ చేసేలా అధికారులకు ఆదేశాలివ్వాలని కోరటం జరిగింది.ఇందుకు ఎంపీ మల్లు రవిగారు సానుకూలంగా స్పందించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటామని వారికి పూర్తి అండగా ఉంటామని తెలిపారు.