సిర్పూర్ U మండల కేంద్రంలో ఈ రోజు ఆదివాసీయుల మహా ధర్నా చేపట్టారు. అటవీ అధికారుల వల్ల అనేక సమస్యలు ఏదురుకుంటున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, భూ వివాదాల్లో వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బంది పెట్టుతున్నారు అని వాదించారు. కచ్చితంగా ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరారు. లేదంటే అటవీ అధికారులు అడుగు పెట్టనివ్వం అని అన్నారు. పెద్దమొత్తం లో ఆదివాసీ నాయకులు, ఆదివాసీ ప్రజలు కోరారు. అడ్డుకుంటే ఊరుకునేది లేదన్నారు. ఆదివాసీ సంఘాల నాయకులు మండిపడ్డారు. ఆదివాసులకు సహాయ సహకారాలు అందించాలన్నారు . డోలు & తుడూమ్ ,డప్పులతో మహా ధర్నా కు దిగారు. అటవీ శాఖ దీనిపైన కచ్చితమైన సమాచారం ఇవ్వాలని కోరారు