గద్వాల టౌన్ నూతన ఎస్ఐగా ఎం. శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ
దిశ, గద్వాల క్రైమ్: గద్వాల పట్టణ పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ)గా ఎం. శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులను నిర్భయంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖతో సహకరించాలని కోరారు.
