ఈసారి దసరా అక్టోబర్ 20వ తేదీనా లేక 21వ తేదీనా..?
ఈ ఏడాది దసరా వేడుకలను అక్టోబర్ 20, మంగళవారం నాడు నిర్వహించాలని పండితులు తెలిపారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో అక్టోబర్ 20నే దసరా జరుపుకోనుండగా.. బెంగాల్లో మాత్రం అక్టోబర్ 21 బుధవారం నాడు విజయదశమి వేడుకలు నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 20మధ్యాహ్నం 12:50గంటలకు ప్రారంభమయ్యే దశమి తిథి అక్టోబర్ 21 మధ్యాహ్నం 2:11వరకు ఉండటంతో పండుగ తేదీల్లో ఈ వ్యత్యాసం వచ్చిందని స్పష్టం చేశారు.
