ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా విద్యాల అనిల్..
ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా బీజ్జాల అనిల్ ను తొర్రూరు పట్టణ కేంద్రానికి చెందిన బీజ్జలా అనిల్ కుమార్ ను ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర పొలిటికల్ కార్యదర్శిగా నియమిస్తూ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ నియామక పత్రం అందించారు. ఆదివారం రాష్ట్ర మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ చేతుల మీదుగా రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రొద్దుటూరు గౌరీ శంకర్ సమక్షంలో నియామక పత్రాన్ని అందుకున్నారు. రెండేళ్ల క్రితం వరకు అనిల్ కుమార్ మహబూబాబాద్ జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకులుగా సుదీర్ఘకాలం తొర్రూరు పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా పనిచేశారు. గత 30 సంవత్సరాలుగా రాజకీయ చరిత్ర గలిగిన అనిల్ కుమార్ కు రాష్ట్ర పదవి రావడంతో ఈ ప్రాంత ఆర్యవైశ్యులు వర్షం వ్యక్తం చేస్తున్నారు అనిల్ కుమార్ వార్డు సభ్యులుగా, మున్సిపల్ కౌన్సిలర్ గా, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులుగా పనిచేసి ఎన్నో సేవలందించిన సందర్భంగా ఈ పదవి బాధ్యతలు అప్పజెప్పారు.
