ఎస్ ఐ ఆర్ రద్దుచేసి తక్షణమే జ్ఞానేశ్ కుమార్ ను రాజీనామా చేయించాలి. రైతు వ్యవసాయ కార్మిక సిఐటియు సంఘాల నాయకుల ఆధ్వర్యంలో నిరసన
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని రద్దుచేసి జ్ఞానేశ్ కుమార్ ను తక్షణమే రాజీనామా చేయించాలని రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం సిఐటియు సంఘాల నాయకులు బొల్లం అశోక్ ఎండి యాకూబ్ జమ్ముల శ్రీనివాస్ లు డిమాండ్ చేశారు. ఢిల్లీ ఘటనను వ్యతిరేకిస్తూ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కొన్ని చేస్తూ ఓట్లను తొలగిస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరు మార్చుకోవాలని తక్షణమే SIR ప్రక్రియ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల అన్ని పార్టీలను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
