మున్సిపల్ నిధులతో బతుకమ్మ వేడుకలు నిర్వహించి ప్రైవేట్ సంస్థకు ప్రచారాలు కల్పించడం దారుణమని.. బతుకమ్మ సంబరాలు నిర్వహించడమేమో ప్రజాధనంతో. ప్రచారమేమో వేటా ఫౌండేషన్ కా అని, తొర్రూరు పెద్ద చెరువులో ఏర్పాటుచేసిన బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో మున్సిపల్ చైర్మన్ కమిషనర్లు పూర్తిగా విఫలమయ్యారని తొర్రూరు మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు అన్నారు. తొర్రూరు పట్టణంలో నిర్వహించిన బతుకమ్మ పండుగ వేడుకలపై ఆదివారం డివిజన్ కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పట్టణంలో మున్సిపాలిటీ నిధులనుండి రూ. లక్షలు వెచ్చించి బతుకమ్మ పండుగను నిర్వహించారని, కానీ ఆ పండుగ ఉమెన్ ఎంపవర్మెంట్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ (వేటా) నిర్వహించిందని ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ నాయకురాలు ఝాన్సీ రెడ్డి ని ప్రభుత్వ కార్యక్రమంలో ఏ హోదాలో వేదికపై పిలుస్తారని ప్రశ్నించారు. కౌన్సిలర్లను వేదికపైకి పిలవకుండా ఏ ప్రోటోకాల్ ప్రకారం ఝాన్సీ రెడ్డిని పైకి పిలిచారన్నారు.