ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.. ఇద్దరికి తీవ్ర గాయాలు....
తెలంగాణ : సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంట్లోని గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఇంట్లో వెంకమ్మ(46), ఆమె కుమారుడు గుంజ శివ(25) ఉన్నారు. స్థానికులు వెంటనే మంటలు ఆర్పి.. గాయపడిన తల్లి, కొడుకులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది
