ఏపీలో ఆరేళ్ల క్రితం తుపాను వల్ల విశాఖలోని తెన్నేటి పార్కు తీరానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశకు చెందిన 'ఎంవీ మా’ నౌక త్వరలో పర్యాటకులకు అందుబాటులోకి రానుంది. సీఆర్ జడ్ నిబంధనలు, అనుమతుల ఆలస్యం కారణంగా ఈ ప్రాజెక్టు ఆగిపోగా, తాజాగా కొన్ని షరతులతో దీన్ని సందర్శనాలయంగా మార్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దసరా నుంచి ప్రజల సందర్శనకు అనుమతించే అవకాశం ఉంది.