రెండో పంట వేసి ఇబ్బందులు పడొద్దు: పొంగులేటి

తెలంగాణ : ఎల్‌నినో తీవ్రత దృష్ట్యా యాసంగి సాగుపై రైతులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ససూచనాలు చేశారు. నీరు, కరెంట్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రైతులు రెండో పంట సాగు చేయవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకోవాలని అన్నారు. ఈ మేరకు కేంద్రాన్ని స్పెషల్ ప్యాకేజీ కోరుతామన్నారు. ఖమ్మంలోని కూసుమంచిలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ అనంతరం ఆయన మాట్లాడారు. విద్యుత్ కొరత తీవ్రంగా ఉందని, తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.