గజ్వేల్ తహసీల్దార్ చిట్టంపల్లి స్వామిపై సస్పెన్షన్ వేటుపడింది. ఇటీవల ఓ రైతును ఉద్దేశించి “నువ్వింకా బతికే ఉన్నావా? పురుగుల మందు తాగలేదా?” అని మాట్లాడినట్లుగా ఉన్న వీడియో వైరలయింది. దీంతో రైతులపై తహసీల్దార్ స్వామి అనుచితంగా మాట్లాడినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఘటనపై ఆర్డీవో ప్రాథమిక నివేదిక ఆధారంగా తహసీల్దార్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని అధికారులు స్వామికి ఆదేశాలు జారీ చేశారు.