భాకరాపేట ఘాట్లో అదుపుతప్పి లోయలో పడిన లారీ
పీలేరు నుంచి తిరుపతి వైపు వెళ్తున్న లారీ భాకరాపేట ఘాట్ వద్ద ప్రమాదానికి గురైంది. మార్గమధ్యంలో ఆటోను తప్పించబోయిన వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో లారీ అదుపుతప్పి ఘాట్లో పడిపోయింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవరు తీవ్ర గాయాలయ్యాయి. అదే మార్గంలో వెళ్తున్న ప్రయాణికులు ప్రమాదాన్ని గమనించి వెంటనే స్పందించారు. గాయపడిన డ్రైవర్ను లారీ నుంచి బయటకు తీసి తిరుపతికి తరలించారు.
