30 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు
కూసుమంచి మండలానికి చెందిన 30 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆదివారం చెక్కులు పంపిణీ చేశారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సునీల్దత్లతో కలిసి లబ్ధిదారులకు మొత్తం రూ. 30,03,480 విలువ చేసే చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. పేద కుటుంబాలకు అండగా నిలిచేందుకు ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. అన్ని వర్గాలకు లబ్ధి కలిగించేలా ప్రజా పాలన నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏదులాపురం మున్సిపల్ చైర్ పర్సన్ పోకబత్తిని అనిత, సర్పంచ్ కొండా కృష్ణవేణి, పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
