విద్యా బుద్ధులు నేర్పాల్సిన టీచర్ ఓ విద్యార్థితో వెకిలిగా ప్రవర్తించారు. UPలోని ఎటావా(D) బిరౌలి స్కూల్లో అసిస్టెంట్ టీచర్ దినేశ్ కుమార్ తన కాళ్ల మధ్యలో స్టూడెంట్ను కూర్చోబెట్టుకున్నారు. పిల్లాడి గుండుపై తబలా వాయిస్తున్నట్లు, బిగ్గరగా నవ్వుతున్నట్లుగా వీడియో తీయించుకున్నారు. దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. వీడియో వైరల్ కావడం, ఆయన తీరుపై విమర్శలు వెల్లువెత్తడంతో అధికారులు సస్పెండ్ చేశారు...