. 🌍 పిల్లలు, కౌమారదశలో ఉన్నవారిలో ఊబకాయం నివారణ, చికిత్స కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తొలిసారిగా ప్రపంచవ్యాప్త మార్గదర్శకాలను విడుదల చేసింది.📊 2024లో, 5–19 సంవత్సరాల వయస్సు గల 17 కోట్ల మంది పిల్లలు, యువత ఊబకాయంతో బాధపడుతున్నారు. 1990లో నమోదైన స్థాయితో పోలిస్తే ఇది నాలుగు రెట్లు ఎక్కువ. ఊబకాయం శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. టైప్-2 మధుమేహం, గుండె జబ్బులు వంటి సమస్యల ముప్పును పెంచుతుంది. అంతేకాకుండా, ఊబకాయం ఉన్న పిల్లలు ఇతరుల అవమానాలు, ఎగతాళి, వేధింపులకు కూడా గురయ్యే అవకాశం ఉంది.పోషక విలువలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం. క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం, ఆటపాటల్లో పాల్గొనడం లాంటివి పిల్లలతో చేయించాలి.