అంగన్‌వాడీ కేంద్రాలకు 12 రోజుల దసరా సెలవులు*
మంత్రి సీతక్క ఆదేశాల మేరకు బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు అక్టోబర్ 10 నుంచి 21వ తేదీ వరకు 12 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. సెలవుల కాలంలో లబ్ధిదారులకు సాధారణంగా అందించే వేడి భోజనం (హాట్ కుక్‌డ్ మీల్)కు బదులుగా టేక్ హోమ్ రేషన్ (THR) పంపిణీ చేయడానికి అనుమతి ఇచ్చారు. అక్టోబర్ 22వ తేదీ నుంచి రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలు యథావిధిగా పనిచేస్తాయి. ఈ మేరకు తమ పరిధిలోని అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, టీచర్లు, హెల్పర్లకు అవసరమైన సూచనలు జారీ చేయాలని జిల్లా సంక్షేమ అధికారులు (DWOs), శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారులును ఆదేశించింది.
