చలో రామగుండంకు పిలుపునిచ్చిన బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..
తెలంగాణకు కొంగుబంగారమైన సింగరేణి బొగ్గు గనులను కబళిస్తున్న కాంగ్రెస్ సర్కార్‌పై జంగ్ సైరన్!
రామగుండంలో “సింగరేణి కార్మిక గర్జన” బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను ఈనెల అక్టోబర్ 14వ తేదీన ఏర్పాటు చేసింది. 40 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు మాయమైనట్లు ఆరోపిస్తున్న కేటీఆర్, ఒక్కొక్క కార్మికుడికి రావాల్సిన మూడు లక్షల 70 వేల రూపాయలకి బదులుగా 1,90,000 చెల్లిస్తూ కార్మికులను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అరాచకాలను ఎండగట్టడానికి ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
