సింగరేణి సంస్థలో పనిచేస్తున్న అర్హులైన ఉద్యోగులకు దసరా పండుగ అడ్వాన్స్ చెల్లించాలని యాజమాన్యం నిర్ణయించింది. రెగ్యులర్, బదిలీ ఉద్యోగులు, ట్రైనీలకు రూ.25 వేలు, ఇతర తాత్కాలిక ఉద్యోగులకు రూ.12,500 చొప్పున ఇవ్వనుంది. ఈ నెల 15వ తేదీన వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు సింగరేణి అధికారులు పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని 10 సమాన వాయిదాలలో తిరిగి వసూలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. పండుగ వేళ యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయంపై సింగరేణి కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.