60 వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన మంతెన జగన్మోహన్ రావు.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్, తోళ్ల వాగుకు చెందిన మట్టపతి మోహన్ గారు అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందగా, వైద్య ఖర్చుల నిమిత్తం కార్మిక శాఖ మంత్రి శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 60,000రూపాయల ఆర్థిక సాహయం మంజూరు చేయించారు.ఈ ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మంతెన జగన్ మోహన్ రావు గారి చేతుల మీదుగా మట్టపతి మోహన్ కు అందజేశారూ. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ మంచిర్యాల నియోజకవర్గ మాజీ అధ్యక్షులు, 11వ డివిజన్ నాయకులు. సుదమల్ల అశోక్ తేజ గారు, పాల్గొన్నారు
