పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రత!
పనామా దేశంలోని దక్షిణ ప్రాంతంలో శుక్రవారం (అక్టోబర్ 9) భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రత నమోదైనట్లు అమెరికా భూగర్భ పరిశోధనా సంస్థ (USGS) వెల్లడించింది.
భూకంపం ప్రభావంతో రాజధాని పనామా సిటీలో భవనాలు తీవ్రంగా కంపించాయి. దీంతో ప్రజలు భయంతో ఇళ్లు, కార్యాలయాలు, షాపింగ్ మాల్స్ నుంచి బయటకు పరుగులు తీశారు. వీధుల్లోకి చేరుకుని ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించారు.
హెరెరా ప్రావిన్స్‌లోని పిటాలోజా అర్రిబా సమీపంలో భూమికి సుమారు 12.6 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ప్రభావిత ప్రాంతాల్లో కొన్ని భవనాలు, రహదారులు దెబ్బతిన్నట్లు సమాచారం.
ప్రధాన భూకంపం తర్వాత 40కి పైగా ప్రకంపనలు (ఆఫ్టర్‌షాక్స్) నమోదయ్యాయి. తొలుత భూకంప తీవ్రత 8.0గా ప్రకటించినప్పటికీ, అనంతరం USGS దానిని 7.7గా సవరించింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం ఎలాంటి మరణాలు నిర్ధారణ కాలేదు. అధికారులు నష్టాన్ని అంచనా వేస్తున్నారు. భూకంపం కారణంగా ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి...
