కెసిఆర్ నీకు తెలంగాణలో భవిష్యత్తు లేదు: సీఎం రేవంత్ రెడ్డి!
నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, పర్యటన ప్రజ లు విజయవంతం చేశారు. నియోజక వర్గ ప్రగతి బాటలో భాగంగా.. మొత్తం రూ"344.92 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శనివారం సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. నకిరేకల్ పట్టణంలోని రాజీవ్ గాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రజా వికాస సభలో ఆయ న మాట్లాడుతూ..
బిఆర్ఎస్ ప్రభుత్వం పై ఆయన నిప్పులు చెరిగారు తెలంగాణ తులసి వనంలో చీడ లా ఉన్న బీఆర్‌ఎస్ గంజాయి మొక్కను పీకేస్తామ ని,త్వరలో సిరిసిల్ల, సిద్దిపేటలపై దండయాత్ర చేస్తామ ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. బావ, బావమరుదులు బంధువులనే తెచ్చు కుంటారో, బానిసలనే తెచ్చుకుంటారో, చెంచాగాళ్లని రప్పించుకుంటారో తేల్చుకోవాలని సవాల్ చేశారు.
కేసీఆర్ కాస్కో.. రాష్ట్రంలో మళ్లీ రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే. సవాల్ చేసి చెబుతున్నా.. ఇప్పుడున్న 119 సీట్లతోనే ఎన్నికలొస్తే 90 స్థానాలు, సీట్లు పెరిగితే 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుంది. 2034 వరకు ఇందిరమ్మ పాలన కొనసాగు తుంది. కేసీఆర్.. రాసి పెట్టుకో.. మీకు ఈ రాష్ట్రంలో భవిష్యత్ లేదు. ఇక చీకటే’’ అని స్పష్టం చేశారు.
శనివారం నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో పర్యటించిన సీఎం రేవంత్‌రెడ్డి.. రూ. 344 కోట్ల వ్యయంతో చేపట్టిన 12 అభివృద్ధి పనులతో పాటు.. రూ.32 కోట్ల వ్యయంతో నిర్మించిన 100 పడకల ప్రాంతీయ ఆస్పత్రిని ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో సిరిసిల్ల, సిద్దిపేట ల్లోనూ కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పారు.
ఈ నెలాఖరులో సిరిసిల్లలో, వచ్చే నెలలో సిద్దిపేటపై దండయాత్ర చేస్తామని.. కాంగ్రెస్ శ్రేణుల అండతో పార్టీ జెండా రెపరెపలాడి స్తామని చెప్పారు. విపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, లేకపోతే గౌరవంగా రాజీనామా చేసి తప్పుకోవాలని సీఎం రేవంత్ స్పష్టం చేశా రు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన, వెయ్యి రోజుల తమ ప్రజా ప్రభుత్వ పాలనపై అసెంబ్లీలో చర్చించ డానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
1000 రోజుల ప్రభుత్వంలో కేసీఆర్ ఒక్కరోజైనా సభకు రాలేదు. కానీ రూ.22,24.40.000 కోట్ల జీతభత్యాలు ఉండటానికి ఇల్లు, తిరగడానికి కారు ప్రభుత్వం నుంచి తీసుకుని ఫాంహౌస్ కు వెళ్లిపోయారు. ప్రజల చెమట, రక్తం తో కట్టిన పన్నుల డబ్బును దొబ్బితింటున్న ఈ నాయకుడిని డిస్మిస్ చేయాలా, వద్దా?.. ప్రజలు ఆలోచించాలి అని రేవంత్ వ్యాఖ్యానించారు.
