జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ పరిధిలో హౌస్ పర్పస్ ( నివాస గృహ )అనుమతులు తీసుకుని షాపింగ్ కాంప్లెక్స్ (వ్యాపార సముదాయాలు )నిర్మాణాలు చేపట్టడంతో ఆ షాపింగ్ కాంప్లెక్స్ భవనాలను పోలీస్ ప్రొటెక్షన్ తో మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు.సరైన అనుమతులు లేని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ చంద్రశేఖర్ మీడియాకి తెలిపారు .ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, Ci, ఎస్సైలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు....