ప్రముఖ రచయిత చరిత్రకారుడు మడికొండ శివప్రసాద్ గురువారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం సెప్టెంబర్ 9న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని శివం రోడ్డులో ఉన్న ఆయన నివాసం సమీపంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.