ప్రముఖ బుర్రకథ కళాకారుడు సిటిమిటి ఉల్లిగెన్న కన్నుమూత
తెలంగాణ రత్న అవార్డు గ్రహీత మృతి జానపద కళారంగానికి తీరని లోటు: మున్సిపల్ చైర్మన్ సీఎం సురేష్
అయిజ: ప్రముఖ బుర్రకథ కళాకారుడు, తెలంగాణ రత్న అవార్డు గ్రహీత సిటిమిటి ఉల్లిగెన్న (82) కన్నుమూశారు. ఆయన మృతి పట్ల అయిజ మున్సిపల్ చైర్మన్ సీఎం సురేష్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఉల్లిగెన్న మృతి జానపద కళారంగానికి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు.
ఉల్లిగెన్న నివాసానికి వెళ్లిన మున్సిపల్ చైర్మన్ సీఎం సురేష్, మున్సిపల్ కౌన్సిలర్లు, బీఆర్‌ఎస్ నాయకులు ఆయన పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. జానపద కళారంగానికి ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
