మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 16 వ డివిజన్లో స్వయంభు విజయదుర్గ అమ్మవారి ఆలయానికి సంబంధించి కొందరు వ్యక్తులు కలిసి గ్రామసభ పేరిట నిర్వహించిన సమావేశం పూర్తిగా పరిపాలన విధానాలకు విరుద్ధమని, ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకున్న కార్పొరేటర్ ను కాదని కార్పొరేటర్ లేకుండానే కొందరు వారికి అనుకూలమైన వ్యక్తులను పెట్టుకొని సభ నిర్వహించి ఇష్టం వచ్చినట్లు తీర్మానం చేయడంపై కార్పొరేటర్ త్రివేణి గారు అసహనం వ్యక్తం చేశారు. 16 డివిజన్ పరిధిలో తన అనుమతి లేకుండా గ్రామ సభ పేరుతో మీటింగ్ పెట్టిన వారు చట్టపరమైన చర్యలకు బాధ్యులు కాక తప్పదు అన్నారు.