స్వయంభు విజయదుర్గ అమ్మవారి ప్రధాన అర్చకుడి తొలగింపు.. విశ్వబ్రాహ్మణ సంఘాల ఆగ్రహం
గత కొద్ది రోజులుగా వివాదంలో ఉన్న మంచిర్యాల కార్పొరేషన్ ముల్కల్ల గ్రామంలో వెలిసిన శ్రీ విజయ దుర్గ అమ్మవారి దేవాలయానికి సంబంధించి ప్రధానార్చకుడు ఎర్రోజు పవన్ శాస్త్రి గారిని తొలగిస్తూ బ్రాహ్మణ వర్గానికి చెందిన గంగారపు రమేష్ శర్మ గారిని కొద్దిమంది వ్యక్తులు కలిసి నియమించడం వివాహస్పదంగా మారింది. అమ్మవారి విగ్రహాన్ని వెలికి తీసి నెలకొల్పి పూజలు చేసి అభివృద్ధి చేసినటువంటి పురోహితుడు పై ఆరోపణలు చేయడంతో పాటు ఇప్పుడు విగ్రహాన్ని వెలికి తీసినటువంటి విశ్వబ్రాహ్మణ వర్గానికి చెందిన పురోహితుని కాకుండా మరొక వర్గం పురోహితుడు నియమించడంతో విశ్వబ్రాహ్మణుల మీద అక్కసు తోనే ఈ ఆరోపణ జారీగినట్లు విశ్వబ్రాహ్మణ సంఘాలు నిరసన దిశగా ఆలోచన చేస్తున్నాయి . ప్రధాన అర్చకుడు పైచేసిన ఆరోపణలో బ్రాహ్మణుల హస్తం కూడా ఉంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలోనే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు విశ్వబ్రాహ్మణ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కంచు పాడు రామాచారి గారు తెలిపారు
