బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త ఏటీఎం ఛార్జీలు మాఫీ చేసిన బ్యాంకులు
దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల సమ్మెలో పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులకు కలిగే అసౌకర్యాన్ని తగ్గించడానికి SBI, PNB, BOB, UBI, ఇండియన్ బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకులు నిర్దేశించిన ఉచిత పరిమితికి మించి ఏటీఎంల నుంచి డబ్బు విత్డ్రా చేసినప్పటికీ ఎటువంటి అదనపు రుసుము వసూలు చేయబోమని నిర్ణయించాయి. ఈ చర్య వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగించనుంది.
