* కర్నూలు కొండారెడ్డి బురుజు  పై నుండి  స్వయంగా పర్యవేక్షించిన  ... కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు. 

* ​డ్రోన్ కెమెరాల లైవ్ ద్వారా  నిరంతర నిఘా.

* ​ప్రశాంత వాతావరణంలో శోభాయాత్ర జరిగేలా పోలీసుల పటిష్ట నిఘా.

కర్నూలు  నగరంలో మంగళవారం అంగరంగ వైభవంగా కొనసాగుతున్న వినాయక నిమజ్జన శోభాయాత్రను కర్నూలు  ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్  ఐపీఎస్ గారు  క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. 

​ఈ సందర్భంగా  కర్నూలు  నగరంలోని కొండారెడ్డి బురుజు సమీపంలోని  అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించారు. 

 అక్కడి నుంచి పాత బస్టాండ్,  గడియారం ఆసుపత్రి మీదుగా సాగే ఊరేగింపు రూట్‌ను పరిశీలించారు.

అనంతరం కొండారెడ్డి బురుజు పైకి వెళ్లి, అత్యాధునిక డ్రోన్ కెమెరాల ద్వారా శోభాయాత్ర ను , ప్రధాన కూడళ్లలోని ట్రాఫిక్ క్రమబద్ధీకరణను మరియు భక్తుల జనసందోహాన్ని స్వయంగా వీక్షించి భద్రతా చర్యలను సమీక్షించారు.

​ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్‌కు ఆటంకం కలగకుండా నిమజ్జనం సాఫీగా పూర్తయ్యేలా సమన్వయంతో విధులు నిర్వర్తించాలని అధికారులను ఆదేశించారు.

ఈ పర్యవేక్షణలో ఎస్పీ గారి వెంట నంద్యాల ఏఎస్పీ సుస్మిత ,  కర్నూలు డీఎస్పీ రాఘవేంద్ర, డోన్ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు మధుసూదన్ రావు, కేశవరెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలు.