తిరుమలలో నృత్యంతో ఆకట్టుకున్న నటి డింపుల్
టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతి కూచిపూడి నృత్యంతో ఆకట్టుకున్నారు. తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆమె ప్రదర్శన ఇచ్చారు. వివిధ నాట్య భంగిమలు, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అలరించారు. కాగా డింపుల్ నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆమె త్రివిక్రమ్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ హీరోగా తెరకెక్కుతోన్న 'ఆదర్శ కుటుంబం'లో నటించారు. ఈ మూవీ అక్టోబర్ 9న రిలీజ్ కానుంది.
