రైతులు అధైర్య పడొద్దు. మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్.. నీటి విడుదలకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు..
ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉండటంతో సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురువకపోవడంతో డ్యాముల్లోకి నీటి చేరిక అంతంత మాత్రమే ఉంది దీంతో కృష్ణ తుంగభద్ర నది పరివాహ ప్రాంతాల రైతులు పంటలు క్రాప్ హాలిడే ప్రకటించడం జరిగినప్పటికీ కొందరు రైతులు ఆశతో పంటలు సాగు చేసుకోవడం జరిగింది. కానీ డ్యాముల్లోకి నీటి లభ్యత ఆధారంగా తాగునీటికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని అదనంగా ఉన్న నీటిని ఒకటి రెండు తడులకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. తుంగభద్ర జలాల్లో ఈ ఏడాది నీటి కేటాయింపులకు అనుగుణంగా మూడు టీఎంసీలు విడతల వారీగా విడుదల చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే జూరాల ఆయకట్టుకు మరో ఐదు టీఎంసీలు అదనంగా విడుదల చేయించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కృషి చేస్తున్నట్లు తెలిపారు...
