కస్టమర్లా నటిస్తూ సెల్ఫోన్ల చోరీ చేస్తున్న యువకుడిని అరెస్టు చేసిన ఉయ్యూరు టౌన్ పోలీసులు
ఉయ్యూరు: పట్టణంలోని ఒక సెల్‌ఫోన్ దుకాణానికి పలుమార్లు కస్టమర్లా వెళ్లి, వివిధ మోడళ్ల సెల్ఫోన్లను పరిశీలిస్తున్నట్లు నటిస్తూ చోరీకి పాల్పడిన వ్యక్తిని ఉయ్యూరు టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
చిన ఓగిరాల గ్రామానికి చెందిన దండుగుల నాగ దుర్గారావు (23) ఈ చోరీకి పాల్పడినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఈరోజు ఉదయం ఎస్సై ప్రతాపరెడ్డి తన సిబ్బందితో కలిసి ఈరోజు ఉదయం నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి సుమారు రూ.లక్ష విలువైన ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడిపై గతంలో తోట్లవల్లూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒక దేవాలయంలో జరిగిన చోరీకి సంబంధించి కేసు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
అనంతరం నిందితుడిని గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరచగా, న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో అతడిని గన్నవరం సబ్‌జైలుకు తరలించినట్లు సీఐ టి.వి.వి. రామారావు తెలిపారు.
