వినాయకుడికి చిన్నారి పూజలు..
వినాయకుడంటే పెద్దల నుంచి చిన్నారుల వరకు అందరికీ ఇష్టమే. కానీ ఎంతో ఇష్టంతో పూజలు చేసిన గణపతికి నిమజ్జనం అంటే చిన్నారులకు బాధే. అయితే గుజరాత్లోని చిఖిలో నిమజ్జనానికి ముందు ఒడ్డున వినాయకుడి విగ్రహానికి అమ్మమ్మతో కలిసి ఓ చిన్నారి హారతి ఇచ్చాడు. అక్కడే ఉన్నవారు అతడిని చూస్తూ ఉండిపోయారు. కొందరు గణనాథుడికి నమస్కరించారు. దీనికి సంబంధించిన వీడియో వైరలవ్వగా క్యూట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
