గుంటూరు జిల్లా పొన్నూరు క్యాబిన్‌పేటలో దారుణ ఘటన.

భర్త మృతి తర్వాత కుమారుడితో కలిసి తల్లి వద్దే ఉంటున్న పుష్పలతకు రాజా అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడినట్లు వెల్లడి.

ఈ బంధానికి దూరంగా ఉండాలని తల్లి లక్ష్మి (48) కూతురిని మందలించడంతో.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసేందుకు పుష్పలత పథకం రచించినట్లు పోలీసులు తెలిపారు.

ఇంట్లో నిద్రిస్తున్న తల్లి లక్ష్మిని హత్య చేసిన అనంతరం.. ఇంట్లోని నగలు, నగదు తీసుకుని కుమారుడిని వదిలి ప్రియుడితో కలిసి పుష్పలత పరార్.

తన తల్లి, బాబాయి కలిసి అమ్మమ్మను హత్య చేశారని పుష్పలత కుమారుడు చెప్పడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.

కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు.