📍మూడు రోజులుగా అందుబాటులో లేని కేంద్ర ప్రభుత్వ RTI పోర్టల్
కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం (DoPT) నిర్వహించే RTI పోర్టల్ సెప్టెంబర్ 10 సాయంత్రం 6 గంటల నుంచి మెయింటెనెన్స్ కారణంగా అందుబాటులో లేదు. మూడు రోజులైనా సేవలు పునరుద్ధరించకపోగా, పోర్టల్‌లో ‘Available Soon’ సందేశమే కనిపిస్తోంది. ఎప్పటికి అందుబాటులోకి వస్తుందనే స్పష్టత లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
