ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు మొత్తం ఉత్తర తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమైన ఆదిలాబాద్ విమానా శ్రయం ఏర్పాటు శర వేగంగా అడుగులు పడుతున్నాయి, వాణిజ్యపరంగా, వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ ప్రాంతం లో జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ ప్రాజెక్టును అతి త్వర లో పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. 

న్యూఢిల్లీలో శనివారం సాయంత్రం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పౌర విమాన యాన మంత్రి కె.రామ్మోహన్ నాయుడుతో కలిసి కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి, నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష లో ఈ ప్రాజెక్టుపై పలు కీలక నిర్ణయా లు తీసుకున్నారు.

 ప్రాజెక్టుకు నోడల్ ఆఫీసర్ల నియామకం.. 

ప్రాజెక్టు పురోగతిని వేగవంతం చేసేందు కు రక్షణశాఖ, పౌర విమానయాన శాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే వారంలోగా ఒక్కో నోడల్ ఆఫీసర్‌ ను నియమించాలని నిర్ణయించారు. జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్‌కు సంబం ధించిన డీపీఆర్, మాస్టర్ ప్లాన్ రూప కల్పన ప్రక్రియను త్వరగా పూర్తి చేయా లని అధికారులను ఆదేశించారు. 

ఉత్తర తెలంగాణలో పౌర విమానయాన సౌకర్యాలు పెంచడం తో పాటు దేశ రక్షణ సామర్థ్యాలను బలో పేతం చేసేందుకు ఆదిలాబాద్ వ్యూహాత్మకంగా అత్యంత కీలకమని, దీని అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హామీ ఇచ్చారు.

అదనంగా 1,500 ఎకరాల భూమి సేకరణ..

ఈ విమానాశ్రయం కోసం 2.75 కిలోమీటర్ల రన్‌వే నిర్మించనున్నారు. ఐఏఎఫ్ వద్ద ఉన్న 369.45 ఎకరాలకు అదనంగా తెలంగాణ ప్రభుత్వం మరో 1,500 ఎకరాల భూమిని సేకరించ నుంది. ఇక్కడ ట్రై నర్ ఎయిర్‌ క్రాఫ్ట్‌లు, హ్యాంగర్స్, ట్రైనింగ్ అండ్ మెయింటెనెన్స్ సదుపాయాలతో పాటు...

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండి యా ఆధ్వర్యంలో ఆధునిక సివిల్ టెర్మినల్, ‘మెయింటె నెన్స్ అండ్ రిపేర్ ఆపరేషన్స్’ఫెసిలిటీని ఏర్పాటు చేయనున్నారు. ఏళ్ల నిరీక్షణ తుది దశకు చేరిందని, ఈ ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణ రూపురేఖ లు మారనున్నాయని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.