తెలంగాణ : హైదరాబాద్‌లోని ఉప్పల్ పరిధి ఇందిరానగర్‌లో విషాదం నెలకొంది. మేడిపల్లిలోని ఓ ఆసుపత్రిలో పనిచేసే గండమళ్ల చందన (23) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బొమ్మలరామారానికి చెందిన తుడుము శివ (23) గత కొంతకాలంగా ప్రేమ పేరుతో చందనను వేధిస్తున్నాడని సమాచారం. ఈ నెల 21న తన అక్కతో బాధను పంచుకున్న చందన, మరుసటి రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.