తెలంగాణ రాబిన్ హుడ్ పండుగ సాయన్న జయంతిని గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలి. కొత్తూరు రమేష్..
తెలంగాణ రాబిన్ హుడ్ గా పేరుగాంచిన బహుజన రాజ్య స్థాపనకు కృషిచేసిన మహనీయుడు పండుగ సాయన్న అని, అక్టోబర్ 22న పండుగ సాయన్న జయంతి ని గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలని మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల జిల్లా ప్రమోటర్ కొత్తూరు రమేష్ పిలుపునిచ్చారు. బుధవారం తొర్రూరు పట్టణ కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1860 వ సంవత్సరం నుండి 1900 సంవత్సరం వరకు స్వాతంత్రోద్యమంలో పాల్గొని బహుజన రాజ్య స్థాపన కోసం కృషి చేసిన మహనీయుడు పండుగ సాయన్న అని అలాంటి పండుగ సాయన్నను నాటి నిజాం రాజులు బందిపోటుగా చిత్రీకరించి భూస్వాములు పెత్తందార్ల చెప్పుడు మాటలతో పండుగ సాయన్నను అరెస్టు చేసి హత్య గావించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి మహనీయుడు పండుగ సాయన్న ఆశయాలను నేటి యువత పునికిపుచ్చుకొని బహుజన రాజస్థాపనకు కృషి చేయాలని ఆకాంక్షించారు.
