దసరా, బతుకమ్మ పండుగల వేళ ఆర్టీసీ ఛార్జీల పెంపుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత BRS Harish Rao తీవ్ర విమర్శలు చేశారు. ప్రత్యేక బస్సుల పేరుతో సాధారణ బస్సులను తగ్గించి, ప్రయాణికుల నుంచి రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ పురుషులపై అదనపు భారం మోపి సామాన్యుల జేబులకు చిల్లు పెడుతున్నారని ఆరోపించారు. పెంచిన ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది.