రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) మరో రూ.15 వేల కోట్ల రుణం మంజూరు చేయనున్నాయి. ఆ రెండు బ్యాంకులూ చేరో రూ.7,500 కోట్లు ఇస్తాయి. దీనికి సంబంధించిన అనుమతుల ప్రక్రియ తుది దశలో ఉంది. ఆ నిధులను 2031 వరకు దశల వారీగా విడుదల చేస్తాయి. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ఇప్పటికే తొలి విడతలో రూ.15 వేల కోట్లు మంజూరు చేశాయి.